ప్రపంచ దేశాధినేతల్లో ప్రధాని మోదీకే పట్టం ..వరుసగా మూడోసారి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొట్టారు. ప్రపంచ నంబర్ వన్ నేతగా వరుసగా మూడో ఏడాది నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను తోసి రాజని మోదీ ప్రథమ స్థానం సాధించారు. మార్నింగ్ కన్సల్ట్ అనే అమెరికా సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచ దేశాధినేతల్లో అత్యంత జనామోదం ఉన్న నేతగా అత్యధిక మంది మోదీకే పట్టం కట్టారు. 72 శాతం మంది ఆయనకు ఆమోదం తెలిపారు. ఆ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఓబ్రడార్ ఉన్నారు. ఆయన 64 శాతం మంది మద్దతు ప్రకటిచారు. 57 శాతం ఆమోదంతో ఇటలీ ప్రధాని మారియో ద్రాగ్చి మూడో ర్యాంకు సాధించారు.
జపాన్ ప్రధాని వ్యూమియో కిషిదాకు 47 శాతంతో ఐదో స్థానంలో, జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షూల్జ్ (42 శాతం) నిలిచారు. బైడెన్ ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. ఆయనకు కేవలం 41 శాతం మంది ఓటేశారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడూలకు 41 శాతం మందే మద్దతు తెలపడంతో బైడెన్‌తో పాటు సంయుక్తంగా ఆరో స్థానాన్ని పంచుకున్నారు. స్పెయిన్ ప్రధాని 37 శాతం, బ్రెజిల్ అధ్యక్షుడు జయర్ బోల్సోనారో ఎనిమిదో ర్యాంకు, 35 శాతం ఓట్లతో ఫ్రాన్స్ ప్రధాని ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ 9వ ర్యాంకు, 30 శాతం మంది ఆమోదంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదో స్థానంలో నిలిచారు.













