గణతంత్ర వేడుకలు .. భారత్ కు చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ భారత్‌కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో అడుగుపెట్టారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, రాష్ట్ర గవర్నర్ కల్రాజ్ మిశ్రా, సీఎం భజన్‌లాల్ శర్మ ఆయనకు స్వాగతం పలికారు. ఢిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న విషయం తెలిసిందే. గతేడాది జులైలో పారిస్‌లో నిర్వహించిన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ బాస్టిల్ డే పరేడ్‌లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.













