బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుంచి మోదీ
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 195 స్థానాలకు గానూ పోటీదారుల పేర్లు ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసోరి వారణాసి నుంచి బరిలోకి దిగనున్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ నేతలు వినోద్ థావడే తదితరులు వివరాలు వెల్లడిరచారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) 16 రాష్ట్రాల్లోని అభ్యర్థిత్వాలపై సుదీర్ఘ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జాబితా వెల్లడైంది.
రాష్ట్రాలవారీగా చూస్తే పశ్చిమబెంగాల్-27, మధ్యప్రదేశ్-24, గుజరాత్-15, కేరళ-12, తెలంగాణ-9, ఝార్ఖండ్-11, ఛత్తీస్గడ్-12, ఢిల్లీ-5, జమ్మూకశ్మీర్-2, ఉత్తరాఖండ్-3, అరుణాచల్ ప్రదేశ్-2, గోవా-1, అండమాన్ నికోబార్-1, దమన్ అండ్ దీవ్-1 అభ్యర్థులను పోటీలో నిలిపింది.













