పర్యాటకులకు గుడ్‍న్యూస్ … 16 నుండి

పర్యాటకులకు కేంద్రం గుడ్‍న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలను ఈ నెల 16 నుండి తెరవనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి భారత పురావస్తుశాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో పలు రాష్ట్రాలు అన్‍లాక్ చర్యలను చేపట్టాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో రెస్టారెంట్లు, మాల్స్ తిరిగి తెరుచుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ పక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. దీంతో ఈ నెల 16 నుండి కేంద్ర సంరక్షణలో ఉన్న చారిత్రక కట్టడాలు, ప్రదేశాలను తిరిగి తెరవాలని నిర్ణయించారు. నిబంధనలు పాటిస్తూ ఆయా ప్రాంతాలను సందర్శించవచ్చని కేంద్ర సాంస్కతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విటర్‍లో పేర్కొన్నారు. కరోనా నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమై భారీగా కేసులు పెరగడంతో అప్రమత్తమైన కేంద్రం ఏప్రిల్ 15 నుండి స్మారక కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మూసివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.