ఎయిర్ ఇండియా ఉద్యోగులకు షాక్
దేశీయ విమానయాన రంగ దిగ్గజమైన ఎయిర్ ఇండియా 48 మంది పైలెట్లను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది. కరోనా సంక్షోభం వల్ల నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా 48 మంది పైలెట్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలగింపునకు గురైన 48 మంది పైలెట్లు గత ఏడాది రాజీనామా చేస్తూ 6 నెలల నోటీసు ఇచ్చినా, వారు దాన్ని ఉపసంహరించుకున్నారు. ఎయిర్ బస్ విమానాలు నడుపుతున్న పైలెట్లను తొలగించింది. పైలెట్లు తొలగింపు ఉత్తర్వులను రద్దు చేయాలని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసిసిఎ) ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బన్సాల్ ను కోరింది.













