సీఎం విజయ్‌కు జైకొట్టిన 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు!
తమిళనాడు రాజకీయాలు (Tamil Nadu) సినిమా థ్రిల్లర్‌ను మించిపోతున్నాయి. ఎన్నికల ఫలితాలతోనే సగం ద్రవిడ కోటను బద్దలుకొట్టిన ‘దళపతి’ విజయ్ (Thalapathy Vijay).. ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష పార్టీల పునాదులనే పెకిలించేస్తున్నారు. ‘టీవీకే’ (TVK) పార్టీకి 108 స్థానాలు వచ్చి, సీఎం పీఠం ఎక్కేందుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సిన తరుణంలో.. రాష్ట్ర రాజకీయాల్లో ఎవరూ ఊహించని అతిపెద్ద రాజకీయ భూకంపం (Political crisis) చోటుచేసుకుంది. ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తుందనుకున్న అన్నాడీఎంకే (AIADMK) పార్టీ నిలువునా చీలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు దళపతి విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవ్వడం చెన్నై రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
ఇవి కూడా చదవండి
సీవీ షణ్ముగం ఆఫీసులో హైడ్రామా..
తాజా (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కేవలం 47 స్థానాల్లో విజయం సాధించి ఎలాగోలా పరువు నిలుపుకునే ప్రయత్నం చేసింది. కానీ, ఇప్పుడు ఆ పార్టీలో భారీ ‘ముసలం’ మొదలైంది. అన్నాడీఎంకేకు చెందిన 35 మంది ఎమ్మెల్యేలు.. చెన్నైలోని పార్టీ సీనియర్ నేత సీవీ షణ్ముగం (CV Shanmugam) కార్యాలయంలో అత్యంత రహస్యంగా సమావేశమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. పాత పార్టీలో ఉండి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకోవడం కంటే, గాలి ఎటు వీస్తుంటే అటు వెళ్లడమే సేఫ్ అని సదరు నేతలు భావిస్తున్నట్లు చెన్నై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
అన్నాడీఎంకే ఉనికే ప్రశ్నార్థకం!
ఈ రహస్య సమావేశంలో పాల్గొన్న 35 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీకే మద్దతు పలకాలని వీరు ప్రాథమికంగా తీర్మానించారు. ఒకవేళ ఇదే జరిగి, అన్నాడీఎంకే తరపున గెలిచిన మొత్తం 47 మంది ఎమ్మెల్యేలలో 35 మంది ఒకేసారి తిరుగుబాటు బావుటా ఎగురవేస్తే.. వారిపై పార్టీ ఫిరాయింపుల చట్టం (Anti-defection law) కూడా పెద్దగా ప్రభావం చూపదు. ఈ వలసలు నిజమైతే, దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఎంజీఆర్, జయలలితల సొంత పార్టీ ‘అన్నాడీఎంకే’ మనుగడే (Tamil Nadu) ప్రశ్నార్థకంగా మారుతుంది.
విజయ్ సర్కార్‌కు డబుల్ ధీమా..
వాస్తవానికి మ్యాజిక్ ఫిగర్ (118) సాధించడానికి టీవీకేకు కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతు లభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ, ఒక సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షాలు ఎప్పుడు ఏ డిమాండ్ పెడతాయో అన్న టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలో ఏకంగా 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ వైపు జంప్ చేస్తే గనక.. బయటి పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా టీవీకే ప్రభుత్వం (TVK Government) అత్యంత సుస్థిరంగా మారుతుంది. మొత్తానికి దళపతి విజయ్ ఎంట్రీతో.. తమిళనాట (Tamil Nadu) దశాబ్దాల ద్రవిడ రాజకీయాల శకం ముగింపు దశకు చేరుకుందని, ఇదొక చరిత్రాత్మక మార్పు అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








