విజయ్ కు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే (TVK) పార్టీ అధిక్యంలో దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత విజయ్ (Vijay) కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అభినందనలు తెలిపారు. రాజకీయ అరంగేట్రంలోనే అదరగొట్టారని ప్రశంసించారు. ఈ విజయం ఓటర్ల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది. రాజకీయ యవనికపై సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ప్రజా జీవితంలోకి అడుగు పెట్టి, బాధ్యత, నిబద్ధతతో ప్రజల ఆకాంకాలు నెరవేర్చే దిశగా అడుగులు వేయనున్న విజయ్‌కు శుభాభినందనలు అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








