ఈ సమావేశం చాలా ముఖ్యమైనదే.. అయినా ఎలాంటి ఆశలు

రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య సమావేశం చాలా చాలా కీలకమైనదే అయినా, ఎలాంటి ఆశలు లేవని క్రిమ్లిస్ (రష్యా అధ్యక్ష భవనం) పేర్కొంది. ఈ నెల 16న స్విట్లర్లాండ్‍లోని జెనీవాలో పుతిన్, బైడెన్ మధ్య ముఖాముఖి సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. సెయింట్ ఫీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం లో క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రో పెస్కోవ్ మాట్లాడుతూ ఈ భేటీతో రెండు దేశాల మధ్య బంధం గట్టి పడుతుందని ఆశించలేమని, విభేదించే అంశాలే ఎక్కువగా ఉంటాయని అన్నారు. సమావేశం చాలా చాల ముఖ్యమైనదే అయితే, దీనిపై అతిగా ఆశలు పెట్టుకోవద్దని పెస్కోవ్ తెలిపారు. ఈ సమావేశంలో ఇరుదేశాలు పరస్పర అంగీకారానికి వచ్చే అంశాలు చాలా తక్కువని, విభేదించే అంశాలే ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఈ సమావేశంలో మానవ హక్కుల నుంచి సైబర్ దాడుల వరకు పూర్తి స్థాయిలో చర్చిస్తారని వైట్ హౌస్ ప్రతినిధి జెన్ సాకి తెలిపారు. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత సమావేశం ఎజెండాలో ఉంటుందని చెప్పారు.