పుతిన్ తో భేటీ నేపథ్యంలో… జో బైడెన్ హామీ

రష్యాకి వ్యతిరేకంగా యురోపియన్ మిత్రపక్షాలకు అమెరికా బాసటగా నిలబడుతుందని అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‍తో ముఖాముఖి సమావేశానికి ముందు ఈ హామీ వెలువడింది. జీ-7, నాటో శిఖారగ్ర సదస్సులకు హాజరవడంతో పాటు, 16వ తేదీన పుతిన్‍తో భేటీ కానున్నారు. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు, మానవ హక్కుల సమస్యలు, హ్యాకింగ్ ఆరోపణలతో గతంలో ఎన్నడూలేని రీతిలో ఇరు దేశాల మధ్య తీవ్ర సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. యురోపియన్ భద్రతకు ఎదురవుతున్న రష్యా సవాళ్ళను పరిష్కరించేందుకు తామందరం ఐక్యంగా నిలబడతామని బైడెన్ పేర్కొన్నారు. తమ ప్రయోజనాల నుండి వేరు చేసి చూడలేనివి ప్రజాస్వామ్య విలువలని, వాటిని పరిరక్షించుకుంటామని అందులో ఎలాంటి సందేహం లేదని బైడెన్ అన్నారు.