బిల్ గేట్స్ కు అరుదైన పురస్కారం…
భారతీయ ఐటీ పరిశ్రమకు పితామహుడిగా పిలుచుకునే దివంగత ఎఫ్‌సీ కోహ్లీ (మరణానంతరం), ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, దాత బిల్ గేట్స్ అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. టై గ్లోబల్ అనే సంస్థ కోహ్లీకి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ సర్వీస్ అవార్డును ప్రదానం చేయగా, బిల్ గేట్స్ కు జీవితకాల సాఫల్య పురస్కారం అవార్డుతో సత్కరించింది. మారియట్ ఇంటర్నేషనల్‌కు చెందిన బిల్ మారియట్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ ఫ్యామిలీ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డును అందుకున్నారు. వర్చువల్ గా జరిగిన గ్లోబల్ సమ్మిట్ 2020 కార్యక్రమంలో ది ఇండస్ వ్యవస్థాపకులు (టీఐఈ) ఈ అవార్డులను ప్రదానం చేసింది. టీసీఎస్ వ్యవస్థాపక సీఈవో దివంగత కోహ్లీ తరపున ఆయన భార్య ఈ అవార్డును అందుకున్నారు.













