ఘనంగా అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వాషింగ్టన్లోని శ్వేతసౌధం బాల్కనీలో ట్రంప్, మెలానియా దంపతులు చూస్తుండగా అధికారులు బాణాసంచా కాల్చారు. అంతకు ముందు వేలాదిగా హాజరైన సైనిక కుటుంబాలకు ట్రంప్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాను సురక్షితంగా, బలంగా, గర్వంగా, స్వేచ్ఛగా ఉంచుతున్నందుకు సైన్యాన్ని ట్రంప్ అభినందించారు. దేశ రక్షణలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నందుకు సైనికులకు దేశం తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బాణాసంచా వెలుతురులో వాషింగ్టన్ మెరిసిపోయింది.













