పాక్‌పై కఠిన చర్యలు : అమెరికా
ఉగ్రవాదులను నిర్మూలించడంలో విఫలమవుతున్న పాకిస్థాన్‌పై ఈ వారంలోగా నిర్దిష్ట చర్యలు తీసుకుంటామని అమెరికా తెలిపింది. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి సారా శాండర్స్ మీడియాతో మాట్లాడుతూ మా కోరిక మేరకు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు వారు (పాకిస్థాన్) మరిన్ని చర్యలు తీసుకోవాలి అని అన్నారు. వచ్చే 24 గంటల నుంచి 48 గంటల్లోపు పాకిస్థాన్‌పై తాము తీసుకోబోయే చర్యలను వెల్లడిస్తామన్నారు. అయితే ఎప్పుడు, ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న విషయమై మాత్రం వైట్‌హౌస్ నుంచి ప్రతిస్పందన లేదు.













