పుతిన్ ను ఆహ్వానించిన అమెరికా
వచ్చే ఏడాది ప్రారంభంలో తమ దేశంలో పర్యటించాల్సిందిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను వైట్‌హౌస్ ఆహ్వానించిందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తెలిపారు. జార్జియాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వారం మాస్కోలో పర్యటన సందర్భంగా పుతిన్‌కు ఈ మేరకు ఆహ్వానం అందజేసినట్లు తెలిపారు. నవంబరు 11న పారిస్‌లో ట్రంప్, పుతిన్‌లు సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. 2015లో అమెరికా గడ్డపై పుతిన్ చివరిసారిగా అమెరికా అధ్యక్షుడితో సమావేశమయ్యారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఒబామాతో ఆయన భేటీ అయ్యారు.













