ఎల్ ఈటీ, టీటీపీతో అమెరికాకు ముప్పు
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా (ఎల్ఈటీ), తెహ్రీక్ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ)తో అమెరికాకు పెనుముప్పు పొంచి ఉందని గుర్తించామని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. ఈ రెండు ఉగ్రవాదసంస్థలతో పాటు బోకోహారాం ఉగ్రసంస్థతో కూడా యూఎస్ఏకు ముప్పు పొంచి ఉందని వారు తెలిపారు. అదేవిధంగా ఐఎస్ఐఎస్, అల్‌ఖైదా, మరో 12కుపైగా ఇస్లామిక్ ఉగ్రసంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయని కౌంటర్ టెర్రరిజం అధికారులు వెల్లడించారు. బోకోహారాం, తెహ్రీక్ ఇతాలిబన్ పాకిస్థాన్, లష్కరే తోయిబా సంస్థలు ఉగ్రదాడులకు భారీ ఎత్తున నియామకాలు చేపట్టాయని అమెరికన్ రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఈ ఉగ్రవాద సంస్థలు వ్యూహం ప్రకారం స్థానిక వనరులు లేదా యునైటెడ్ స్టేట్స్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా దాడులు చేసే విధంగా ప్రాంతీయ లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని వారు తెలిపారు.













