ప్రపంచ బ్యాంక్ అధ్యక్షురాలిగా ఇంద్రా నూయి?
ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి జిమ్ యోంగ్ కిమ్ రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడు ఎవరు అనే దానిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్, ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. కాగా ఇప్పుడు తాజాగా పెప్సికో మాజీ సీఈవో, ప్రముఖ భారత సంతతి మహిళ ఇంద్రా నూయీ పేరు కూడా వినిపిస్తోంది. ఇంద్రా నూయీ ప్రపంచబ్యాంకు అధ్యక్షురాలు అయితే బాగుంటుందని అమెరికా అధ్యక్ష నివాసనమైన వైట్‌హౌస్ భావిస్తున్నట్లు సమాచారం. ఆమెను ప్రతిపాదించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ వైట్‌హౌస్ ఆమె పేరును ప్రతిపాదిస్తే అందుకు నూయీ అంగీకరిస్తారా లేదా అనే విషయంపై సృష్టత లేదు.













