వెనక్కి తగ్గిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. సీఎన్ఎన్ రిపోర్టర్ జిమ్ అకోస్టా వైట్‌హౌస్ పాసును పునరుద్ధరించినట్టు ప్రకటించారు. ఈ నెల 8న జరిగిన మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడితో వాగ్వాదానికి దిగారని ఆరోపిస్తూ ఆకోస్టా పాస్‌ను వైట్‌హౌస్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. వైట్‌హౌస్ తీరుపై సీఎన్ఎన్ మీడియా సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ హక్కులను భంగం వాటిల్లిందంటూ న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అకోస్టా మీడియా పాస్‌ను తక్షణమే పునరుద్ధారించాలని ఆదేశించింది.













