దావోస్ సదస్సుకు డొనాల్డ్ ట్రంప్!
స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో వచ్చే నెల జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) వార్షిక సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు. దావోస్ సదస్సుకు వరుసగా రెండో సంవత్సరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నట్టు వైట్‌హౌస్ అధికారికంగా ధృవీకరించింది. దావోస్ లో జనవరి 22 నుంచి 25 వరకు నాలుగు రోజులపాటు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరగనుంది. గత ఏడాదిలానే ఈసారి కూడా అమెరికా అధ్యక్షుడు హాజరవుతారు అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా సాండెర్స్ మీడియాకు వెల్లడించారు. దావోస్ సదస్సు లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు పలువురు మంత్రులు, ట్రంప్ సలహాదారులు, ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ కూడా పాల్గొంటారు.













