కరోనా వైరస్ కు విరుగుడు
మానవాళి పాలిట మృత్యుశాపంగా మారిన కరోనా వైరస్‌కు విరుగుడుగా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నామని, దీనిలో ఇప్పటికే పురోగతి సాధించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వ్యాక్సిన్‌ను పరీక్షించేందుకు ఇంకా ఎంతో దూరం లేదని వ్యాఖ్యానించారు. అతి త్వరలో దీనికి సంబంధించిన పరీక్షలు జరపబోతున్నట్లు వెల్లడించారు. వ్యాక్సిన్ తయారీకి నిర్దిష్ట సమయం పడుతుందని, అయినప్పటికీ వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. శ్వేతసౌధంలో రోజువారీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే వైరస్ వ్యాప్తి, ఆర్థిక పరిస్థితులపై కూడా మాట్లాడారు.













