వర్జీనియా వర్సిటీలో కాల్పుల కలకలం
అమెరికా మరోసారి కాల్పుల ఘటనతో ఉలిక్కిపడింది. లాస్‌వేగాస్ కాల్పుల ఘటన మరువక ముందే అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీలో దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ వ్యక్తికి గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే వర్సిటీ క్యాంపస్ కు చేరుకున్న పోలీసులు విద్యార్థులందరినీ ఖాళీ చేయించిన వర్సిటీని మూసివేశారు. దుండగుల కోసం అణువువునా గాలిస్తున్నారు. యూనివర్సిటీ వైపు ఎవరూ రావద్దని సామాజిక మాధ్యమాల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల్లో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుండగుడు తెల్లని కోటు వేసుకున్నట్లు అతడు పోలీసులకు వివరించారు.













