బే ఏరియాలో విజయ్ పాటల కచేరి
బే ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ ప్రకాష్ సంగీత విభావరిని ఏప్రిల్ 28వ తేదీన ఏర్పాటు చేశారు. ఏమాయ చేసావే, అత్తారింటికి దారేది, మిర్చి, రోబో, సన్నాఫ్ సత్యమూర్తి, కిరాక్ పార్టీ హలో హలో ఏంటి అన్నీ విజయవంతమైన సినిమాల్లో సూపర్ హిట్ పాటలను విజయ్ పాడిన సంగతి తెలిసిందే. గ్రామీ అవార్డు గెలుచుకున్న జయహో పాటను పాడిన వారిలో ఒకరైన విజయ్ ప్రకాష్ ఫిలింఫేర్, బెస్ట్ మేల్ ప్లేబాక్ మరియు మరెన్నో మ్యూజిక్ అవార్డ్స్ గెలుచుకున్నారు. ే ఏప్రిల్ 28 న ఇండియా కమ్యూనిటీ సెంటర్లో సాయంత్రం 6 గంటలనుండి జరిగే ఈ పాటలకచేరీకి అందరూ రావాల్సిందిగా బే ఏరియా తెలుగు అసోసియేషన్ కోరుతోంది.













