వీక్షణం సాహితీ గవాక్షం- సప్తమ వార్షికోత్సవం
కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లోని స్వాగత్ హోటల్ లో సెప్టెంబరు 8, 2019 ఉదయం 10 గం.నుండి సాయంత్రం 5 గం. వరకు వీక్షణం- సాహితీ గవాక్షం సప్తమ వార్షికోత్సవం ఆహూతుల ఆనందోత్సాహల నడుమ అత్యంత రసవత్తరంగా జరిగింది. వీక్షణం నిర్వాహకురాలు డా పపకె. గీత మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా నెల నెలా క్రమం తప్పకుండా కొనసాగుతున్న వీక్షణం సాహిత్య కార్యక్రమాలకు సహకారం అందజేస్తున్న స్థానిక సాహిత్య కారుల్ని, అభిమానుల్ని వేనోళ్ల కొనియాడారు.
ఈ సభలో ఉదయం సెషన్‌కు పొద్దుటూరి ఎల్లారెడ్డి అధ్యక్షత వహించగా, పిల్లలమర్రి కష్ణకుమార్ ”వేదాలు అపౌరుషేయాలా”, శ్రీ చరణ్ పాలడుగు ”ఉపమా కాళిదాసస్య”, శ్రీ చుక్కా శ్రీనివాస్ ”ఖదీర్ బాబు కథలు”, కల్లూరి సత్య రామ ప్రసాద్ ”హద్యమైన తరి- పద్యమే సరి” అన్న అంశాల మీద ఉపన్యసించారు. భోజన విరామానంతరం జరిగిన వీక్షణం రెండవ సెషన్ కు శ్రీమతి మంజుల జొన్నలగడ్డ అధ్యక్షత వహించారు. వీక్షణం వార్షిక సాహితీ సంచికల ఆవిష్కరణలో సంచికను అందంగా పొందుపరిచి, రూపుదిద్దిన శ్రీమతి కాంతి కిరణ్‌తో బాటూ సంచికకు సంపాదకత్వం వహించిన కిరణ్ ప్రభ, డాపపకె.గీత, నిర్వాహకులు లెనిన్లు పాల్గొన్నారు. తర్వాత తెలుగురచయిత డాట్ ఆర్గ్ నిర్వాహకులు డాపపకె. గీత, సుభాష్ పెద్దు మాట్లాడుతూ ప్రతిరోజూ ఒక రచయితకు ఒక పేజీ చొప్పున తెలుగు రచయితలందరికీ అంతర్జాల భాండాగారాన్ని నిర్మిస్తున్న తెలుగు రచయిత వెబ్ సైటుకు తగిన వివరాలు తెలియజేయడం, ఆర్ధిక సాయం చేయడం ద్వారా సహాయ సహకారాలు అందించాలని అందరికీ సభా ముఖంగా విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత జరిగిన ”కథ- స్వరూప స్వభావాలు” చర్చా కార్యక్రమాన్ని తాటిపామల మత్యుంజయుడు నిర్వహించారు. ఇందులో ప్రముఖ విమర్శకులు, వ్యాసకర్త కె.ప్రభాకర్, ప్రముఖ కథా రచయిత శ్రీధర పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన కవిసమ్మేళనంలో 18 మంది కవులు పాల్గొని కవిత్వపు విందుని అందజేసారు. ఈ కవి సమ్మేళనాన్ని రావు తల్లాప్రగడ నిర్వహించారు. చివరగా శ్రీమతి శారద కాశీవఝల నిర్వహించిన క్విజ్ అందరినీ అలరించింది.
ఈ సభకు విచ్చేసి, దిగ్విజయం చేసిన స్థానిక ప్రముఖులు, ఇండియా నుంచి విచ్చేసిన వక్తలు, సాహిత్యాభిమానులకు కతజ్ఞతలతో వీక్షణం నిర్వాహకురాలు డాపపకె.గీత వందన సమర్పణ చేసి సభను ముగించారు.













