పాక్ కు మరోసారి అమెరికా హెచ్చరిక
ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వరాదన్న ఐక్యరాజ్యసమితి భద్రతామండలి నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటూ పాకిస్థాన్‌ను అగ్రరాజ్యం మరోసారి హెచ్చరించింది. టెర్రరిస్టుల ఆర్థిక కార్యకలాపాలను అడ్డుకోవాలని సూచించింది. బందీగా చిక్కిన భారత పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాక్ విడుదల చేయడాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్వాగతించారు. ఉద్రిక్తతలను తగ్గించే దిశగా భారత్, పాక్ దేశాలు చర్యలు తీసుకోవాలని పునరుద్ఘాటించారు. కాగా, అమెరికాలో తయారైన ఎఫ్-16, ఆమ్రామ్ క్షిపణిని తన సైనిక స్థావరాలపై పాక్ ప్రయోగించిందంటూ భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించిన విషయాన్ని పరిశీలిస్తున్నామని అగ్రరాజ్యం తెలిపింది.













