80మంది వెనిజులా అధికారుల వీసా రద్దు చేసిన అమెరికా
దాదాపు 80 మంది వెనిజులా అధికారుల వీసాలను రద్దు చేసినట్టు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రకటించారు. వీరిలో మదురో ప్రభుత్వ అధికారులు, వారి కుటుంబ సభ్యులు వున్నారని తెలిపారు. కాగా వెనిజులాలో స్వేచ్ఛను పునరుద్ధరించేవరకు మదురో ప్రభుత్వంపై తమ ఒత్తిడి కొనసాగుతుందని ఆయన తెలిపారు. గత శనివారం అమెరికా 49 మంది వీసాలను రద్దు చేసింది. అంతకుముందు ఆరుగురు అధికారులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. వెనిజులాలకు అమెరికా పంపాలనుకున్న మానవతా సాయాన్ని అడ్డుకున్నారనే కారణంతో వారిని ఆ జాబితాలో పెట్టినట్లు చెప్పారు. పదే పదే వెనిజులా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని పేర్కొంటూ జర్మనీ రాయబారిని వెనిజులా బహిష్కరించింది. అదే రోజు నుంచి అమెరికా కొత్త ఆంక్షలు ప్రకటించింది.













