సౌదీ అధికారులు, మంత్రుల వీసాలు రద్దు : అమెరికా
ది వాషింగ్టన్ పోస్ట్ పాత్రికేయుడు, దివంగత జమాల్ ఖషోగి(59) హద్యోదంతంపై అగ్రరాజ్యం చర్యలు ప్రారంభించింది. హత్యతో సంబంధం ఉన్న పలువురు సౌదీ అరేబియా అధికారులు, మంత్రుల వీసాలు రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. వీరిలో సౌదీ నిఘావర్గాల సిబ్బంది, రాజాస్థానానికి, విదేశాంగ శాఖకు చెందిన వారు, ఇతర మంత్రులు ఉన్నారు. అమెరికా కాంగ్రెస్, ప్రపంచంలోని మిత్రదేశాలతో సంప్రదింపుల అనంతరం ఆంక్షలు విధించనున్నట్లు ఆ దేశ విదేశాంగమంత్రి మైక్ పాంపియో తెలిపారు. వీటితో సరిపెట్టం. హింసతో ఖషోగి నోరు మూయించినవారు, ఆయన హత్యకు బాధ్యులైనవారిపై మరిన్ని చర్యలు తీసుకుంటాం. ఇలాంటి నిర్దయతో కూడిన దుర్మార్గాలను అమెరికా సహించదు అని ఆయన పేర్కొన్నారు.













