యుఎస్ ఓపెన్ విజేత నాదల్
టెన్నిస్ సూపర్‌స్టార్, రెండో సీడ్ రఫెల్ నాదల్ మరోసారి సత్తాచాటాడు. అంచనా వేసినట్టు అలవోకగా కాకపోయినా అత్యంత ఉత్కంఠ నడుమ సాగిన తుదిపోరులో విజయం సాధించి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను నాలుగోసారి ముద్దాడాడు. ఒత్తిడిని అధిగమించడంలో తనకుతానే సాటి అని నిరూపించుకున్నాడు. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ నాదల్ 7-5, 6-3, 5-7, 4-6, 6-4 తేడాతో ఐదో సీడ్ మెద్వదెవ్ (రష్యా)పై విజయం సాధించి టైటిల్‌ను ఒడిసిపట్టాడు. స్విస్ దిగ్గజం ఫెదరల్ (20) ఆల్‌టైం గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డుకు స్పెయిన్ బుల్ (19) మరింత చేరువయ్యాడు. క్షణక్షణం ఉత్కంఠ, గేమ్.. గేమ్‌కు మారిన ఆధిపత్యం నడుమ 4 గంటల 49 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన తుది పోరులో ప్లేయర్లిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. నాదల్ ఐదు ఏఎస్‌లు, 62 విన్నర్లు సంధించగా, మెద్వదెవ్ ఏకంగా 14 ఏస్‌లు, 75 విన్నర్లుతో అదరగొట్టాడు. అయితే, నాదల్ దూకుడును తట్టుకోలేక 75 సార్లు తప్పిదాలు చేసి మూల్యం చేల్లించుకున్నాడు. కీలక సమయాల్లో ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసిన రఫా.. చివరకు విజయ దరహాసం చేశాడు.













