అమెరికా మరో కీలక ఒప్పందం
కరోనా కట్టడికి వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చే క్రమంలో అమెరికా మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనాకు కచ్చితమైన వ్యాక్సిన్ తమదేనని చెప్పుకుంటున్న అమెరికా కంపెనీ మోడెర్నాతో ఈ ఒప్పందాన్ని చేసుకుంది. 100 మిలియన్ మోతాదుల కోవిడ్ 19 ప్రయోగాత్మక వ్యాక్సిన్ను తయారు చేసి పంపిణీ చేసేలా డీల్ కుదుర్చుకుంది. మోడెర్నా వ్యాక్సిన్ 100 మిలియన్ల మోతాదుల తయారు, పంపిణీకి ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదిరిందని, టీకాకు అనుమతి లభించిన వెంటనే 100 మిలియన్ మోతాదులను వేగంగా ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.













