చైనా వైఖరిపై అమెరికా ధ్వజం
మసూద్‌పై నిషేధం ప్రతిపాదనకు అడ్డుపుల్ల వేయడాన్ని ఉద్దేశించి తాజాగా చైనా వైఖరిని అమెరికా విదేశాంగ మంత్రి మైఖేల్ పాంపియో చైనా వైఖరిని దుయ్యబట్టారు. 10 లక్షల మందికి పైగా ముస్లింలను దేశంలో వేధిస్తున్న చైనా హింసాత్మక ఉగ్రవాద ముఠాలను మాత్రం ఐరాస ఆంక్షల నుంచి రక్షిస్తోందని ఆరోపించారు. సిగ్గుచేటైన రీతిలో ముస్లింలపై చైనా ప్రదర్శిస్తున్న కపటత్వాన్ని ప్రపంచం హర్షించడం లేదు అని ట్వీట్ చేశారు. చైనాలో అపార వనరులున్న జింజి యాంగ్లో విస్తృతస్థాయిలో వుయిషుర్ మైనారిటీలను నిర్బంధంలో ఉంచిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి విధానాలకు చైనా స్వస్తి పలకాలని మైఖేల్ పాంపియో హితవు పలికారు.













