పాక్ స్థాన్ పై ఒత్తిడి పెంచాలి
పాకిస్థాన్ తన ప్రవర్తనను మార్చుకునేలా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దానిపై ఒత్తిడి పెంచాలని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ డిమాండ్ చేశారు. అఫ్గానిస్థాన్‌కు భద్రతా మండలి బృందం సందర్శనలో పాల్గొన్న ఆమె తిరిగి వచ్చినప్పుడు ఈ ప్రకటన చేశారు. పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచాలని 15 మంది సభ్యుల మండలిని ఆమె గట్టిగా కోరారు. పాకిస్థాన్ ప్రవర్తన మార్చుకొని చర్చలకు వచ్చేలా చేయడానికి ఏకాభిప్రాయం అవసరమని భద్రతా మండలి పేర్కొన్నట్లు తెలిపారు. ఆఫ్గాన్ ప్రభుత్వం పది అడుగులు ముందుకు నడిచినపుడల్లా పాక్‌కు తలుచుకుని వెనక్కి మళ్లుతోందని ఆమె విమర్శించారు. వచ్చే నెల అఫ్గాన్ ప్రభుత్వంతో కాబూల్‌లో కీలక సమావేశానికి ముందు భద్రతా మండలి ప్రతినిధి వర్గం ఈ సందర్శన జరిపింది. తాలిబన్లు చర్చలకు కలిసివచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ఆఫ్గాన్ అన్నట్లు హేలీ తెలిపారు.













