ఐరాస సాధారణ సభ సమావేశాలు ప్రారంభం
ఐరాస సాధారణ సభ సమావేశాలు న్యూయార్క్ నగరంలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు మహమ్మద్ బాందె అధ్యక్షత వహించారు. నాణ్యమైన విద్య, పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై సాధారణ సభల చర్చించనున్నట్టు వెల్లడించారు. వీటితో పాటు శాంతి పరిరక్షణ, భద్రత అంశాలపై చర్చిస్తామని బాందె తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఆరు అంశాల్లో సాధారన సభ ఒకటి. దీనిలో అన్ని దేశాల ప్రతినిధులకు సభ్యత్వం ఉంటుంది. తాజాగా ప్రారంభమైన 74వ సదస్సులో ప్రసంగించేందుకు 143 దేశాలకు చెందిన ప్రతినిధులు, అధికారులు న్యూయార్క్ నగరానికి చేరుకున్నారు.













