అమెరికా వాణిజ్య కమిషనర్‌గా భారత సంతతి వ్యక్తి
అమెరికా వాణిజ్య కమిషన్ అధికారిగా భారత సంతతి వ్యక్తి నియమితులుకానున్నారు. ఫెదరల్ కమిషన్‌లో ప్రస్తుతం ఆర్థిక సేవల నిపుణుడిగా పనిచేస్తున్న రోహిత్ చోప్రాను కమిషనర్ పదవికి ట్రంప్ నామినేట్ చేయనున్నట్లు వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. సైనిక కుటుంబాలు, యువ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిశోధనలు చేసే విభాగంలో రోహిత్ ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సెప్టెంబరు 25, 2019తో ఆయన ఏడేళ్ల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనకు కమిషనర్‌గా పదోన్నతి లభించనున్నట్లు వైట్‌హౌస్ ప్రకటనలో పేర్కొంది. 2010-15 మధ్య కాలంలో వినియోగదారుల ఆర్థిక సంరక్షణ సంస్థలో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. 2016లో ఆయన విద్యా కార్యదర్శి ప్రత్యేక సలహాదారుగా కూడా నియమితులయ్యారు. హార్వర్డ్ వర్సిటీ నుంచి బ్యాచిలర్ పట్టా పొందిన రోహిత్, పెనిసెల్వేనియా యూనివర్శిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మాస్టర్స్ పట్టా పొందారు.













