డొనాల్డ్ ట్రంప్ ఎందుకు వస్తున్నారు?
అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో నిర్వహించనున్న హౌడీ మోదీ సభకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు హాజరవుతున్నారంటే….2020లో తిరిగి అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ట్రంప్ హ్యూస్టన్లోని భారత సంతతి అమెరికన్ల మద్దతు చాలా అవసరం. సహజంగా డెమోక్రాట్లకు మద్దతు పలికే భారతీయుల్ని ఈ మారు ఎలాగైనా రిపబ్లికన్ పార్టీవైపు తిప్పుకోవడం ట్రంప్ పర్యటన లక్ష్యం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించాలని బలంగా కోరుకుంటున్న అమెరికా తాజాగా జపాన్, భారత్, ఆస్ట్రేలియాలతో కలిసి చతుర్ముఖ యంత్రాంగాన్ని (క్యాద్) ఏర్పాటు చేయాలని బలంగా కొరుకుంటోంది. ఈ ప్రయత్నాలకు ఊపునివ్వడమూ ట్రంప్ హాజరు వెనుక ఉద్దేశం. భారత్లో వ్యవసాయం, పాడి తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని అమెరికా ప్రైవేటు బహుళజాతి కంపెనీలు కోరుకుంటున్నాయి. ఈ వ్యాపార బంధాన్ని పటిష్టం చేయాలని ట్రంప్ అభిలషిస్తున్నారు.













