అది చైనా వైరసే : ట్రంప్
కరోనా వైరస్ చైనా నుంచే వచ్చిందని, దీన్ని అగ్రరాజ్యం ఏమంత తేలిగ్గా తీసుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇది (కరోనా వైరస్) చైనా నుంచి వచ్చింది. దీని పట్ల మేము సంతోషంగా లేము. మేము ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ సిరా ఇంకా ఆరనే లేదు. ఒక్కసారిగా ఇది లోపలికి వచ్చింది. దీన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు అని మిచిగాన్‌లో జరిగిన ఆఫ్రికన్ అమెరికన్ నాయకుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో చైనా ఘోరంగా విఫలమైనట్టు ట్రంప్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే చైనాపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నది మాత్రం ట్రంప్ వెల్లడించడం లేదు.






