అద్ధ్యక్ష ఎన్నికలు శాస్త్రాన్ని అణగదొక్కగలవని ఆరోగ్య నిపుణులు ఆందోళన
అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగిర పడుతుండడంతో అద్ధ్యక్షులు ట్రంప్ కోవిడ్ -19 కారణంగా ఎదుర్కొంటున్న వ్యతిరేకతను అధిగమించటానికి అద్ధ్యక్ష ఎన్నికల రోజు కంటే ముందే కోవిడ్ -19 వ్యాక్సిన్ విడుదల చేయడానికి అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసుకోని మరియు భద్రత లేని కోవిడ్ -19 వ్యాక్సిన్ ను ఆమోదించమని ఆరోగ్య అధికారులపై అద్ధ్యక్షులు ట్రంప్ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ ఎస్. కాలిన్స్ ఆందోళన వ్యక్తం చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
ఆగస్టు 23 న అద్ధ్యక్షులు ట్రంప్ రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా కోవిడ్ -19 చికిత్స కోసం ప్లాస్మా థెరపీ కి ఆమోదించినట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే అంతేకాక ప్లాస్మా థెరపీ కోవిడ్ -19 మరణాలను 35 శాతం తగ్గించగలదని కూడా ఆయన ప్రకటించారు. అయితే ఆగస్టు 19 బుధవారం న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ ఎస్. కాలిన్స్ కి అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కాల్ చేసి కోవిడ్ -19 నయం అయినా రోగుల నుండి రక్త ప్లాస్మా తీసుకొని కోవిడ్ -19 రోగుల కి ఈ ప్లాస్మా తో చికిత్స చేయడానికి అత్యవసర ఆమోదం ఇవ్వవలిసిందిగా ఆదేశించారు అని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
ప్లాస్మా థెరపీ ప్రకటన చేసిన రాత్రి, డాక్టర్ కాలిన్స్ కు మరియు డాక్టర్ పీటర్ మార్క్స్ వైట్ హౌస్ వద్ద వారికి కరోనావైరస్ పరీక్ష పేరుతో ప్రెస్ మీట్ నుండి దూరంగా ఉంచిన కారణంగా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్లోని అగ్ర నియంత్రకులు మరియు కోవిడ్ -19 వ్యాక్సిన్ ఆమోద ప్రక్రియ లో స్వాతంత్ర్యం తో బాధ్యత గా పనిచేయవలసిన వ్యక్తులు అయుంది అధ్యక్షులు మరియు ఇతర ఉన్నతాధికారులు కోవిడ్ -19 చికిత్సకు ప్లాస్మా థెరపీ యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అని ప్రజలని తప్పుదారి పట్టిస్తున్న నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవడం మే ఈ ఆందోళనకు కారణం అని డాక్టర్ ఫ్రాన్సిస్ ఎస్. కాలిన్స్ తెలిపినట్టు న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.













