ప్రతిభావంతులకే హెచ్ 1బీ వీసా ?
అమెరికాలోని అత్యంత నైపుణ్యవంతులైన విదేశీయులు ప్రవేశించడంలో హెచ్-1 బీ వీసాలు మెరుగైన పాత్ర పోషించేలా వలస విధానాలు ఉండాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం కోరుకుంటోందని వైట్‌హౌజ్ ఉన్నతాధికారులు సృష్టం చేశారు. ప్రస్తుత హెచ్-1బీ వీసాల విధానం ఔట్ సోర్సింగ్ నియామకాల మాదిరిగా ఉండకూడదని వారన్నారు. కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు అమెరికా సంస్థలను అనుమతించేవే హెచ్1బీ వీసాలు. ప్రత్యేక నైపుణ్యాలు అంటే ఏంటో, హెచ్-1బీ వీసా కింద ఉపాధి అంటే ఏంటో పునర్నిర్వచించేందుకు అమెరికా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. శ్వేతసౌధం ఉన్నతాధికారి క్రిస్ లిడ్డెల్ మాట్లాడుతూ అత్యంత ప్రతిభావంతులైన విదేశీయులు మాత్రమే అమెరికాలో ఉండేలా చూసేందుకు ఆయన విధానాలు రూపొందిస్తున్నారు. ఈ రకమైన వలసలపైన మాత్రమే ఆయన సానుకూలంగా ఉన్నారు అని తెలిపారు.













