వైట్‌హౌస్ దీపావళి వేడుకల్లో ట్రంప్
వైట్‌హౌస్‌లో తన తొలి దీపావళి వేడుకలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైభవంగా జరుపుకోనున్నారు. అంతేకాదు ఒబామా ప్రభుత్వం నాటి సంప్రదాయాన్ని పాటిస్తూ, పెన్సిల్వేనియా ఎవెన్యూవో విందును కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఆ కార్యక్రమంలో 200 ల మంది ప్రవాస భారతీయులు పాల్గొంటారు. దీపావళి వేడుకల సందర్భంగా వీసా సమస్యలపై ట్రంప్ కీలక ప్రకటన చేస్తారని ప్రవాస భారతీయులు ఆశిస్తున్నారు. అనుకున్నట్లు జరిగేతే కొంతసానుకూల వాతావరణం రావచ్చని అభిప్రాయపడుతున్నారు. చికాగోలోనూ ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తారని రిపబ్లికన్ హిందూ కోఎలిషన్ వ్యవస్థాపకుడు, ట్రంప్ మద్దతుదారు శలభ్‌కుమార్ అన్నారు. ఐతే వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్న ట్రంప్, జూన్‌లో రంజాన్‌ను జరుపుకునే సంప్రదాయానికి స్వస్తిపలకటం గమనార్హం. భారతీయ సమాజమన్నా, హిందువులన్నా ్టట్రంప్కు సాప్ట్‌కార్నర్ ఉందని ఈ సందర్భంగా అందరికి తెలుస్తుందని పార్టీ వర్గాలు పేర్కొనడం గమనార్హం.













