ప్రవాస భారతీయులకు ట్రంప్ విందు
అమెరికా అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న తొలి దీపావళి సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ 200 మంది భారత-అమెరికన్లకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఒబామా హయాం నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 1600, పెన్సిల్వేనియా అవెన్యూ వద్ద ఆతిథ్వం ఇస్తున్నారు. ఈ విందు సందర్భంగా వీసా సంబంధిత అంశాలపై ట్రంప్ సానుకూలంగా స్పందిస్తారని భారత-అమెరికన్లు ఆశిస్తున్నారు. గతంలో షికాగో ప్రదర్శనలో భారత అమెరికన్లు చేసిన విజ్ఞప్తిని కూడా ట్రంప్ పరిశీలిస్తారన్న ఆశాభావాన్ని ట్రంప్ మద్దతుదారు, రిపబ్లికన్ హిందూ కూటమి వ్యవస్థాపకుడు షాలభ్ కుమార్ వ్యక్తం చేశారు.













