న్యూయార్క్ లో టీమిండియా ఆటగాళ్లు

ఐసీసీ మెగా టోర్నీ టీ 20 వరల్డ్ కప్ 2024 మరో ఐదు రోజుల్లో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. అమెరికా, విండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రపంచ కప్‌లో ఈసారి ఏకంగా 20 జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే అన్ని జట్లు టీ20 సమరానికి సిద్ధమయ్యాయి. ఆయా జట్లు తాము మ్యాచులు ఆడే వేదికలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో భారత జట్టు కూడా అమెరికా పయనమైంది. తాజాగా టీమిండియా ఈ పొట్టి ప్రపంచకప్ కోసం న్యూయార్క్ చేరుకుంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ ముగియడంతో ఫైనల్ ఆడే భారత్ క్రికెటర్లు తప్ప మిగలినవాళ్లంతా యూఎస్ ఫ్లైట్ ఎక్కారు. తాజాగా వీరు న్యూయార్క్‌లో దిగారు.