బే ఏరియాలో సుజనా చౌదరి పర్యటన

బే ఏరియాలో పర్యటిస్తున్న కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంట్ సభ్యుడు సుజనా చౌదరికి ఆత్మీయ స్వాగతం లభించింది. అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి ఆయనకు స్వాగతం పలికారు. మిల్‌పిటాస్‌లో ఉన్న స్వాగత్ హోటల్‌లో తెలుగుదేశంపార్టీ ఎన్నారై అభిమానులతో సుజనా చౌదరి సమావేశమయ్యారు. ఈ?సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను ఆయన వివరించారు. వెంకట్ కోగంటి, ప్రసాద్ వాసిరెడ్డి, ప్రసాద్ మంగిన, రజనీకాంత్ కాకర్ల తదితరులు ఈ సుజనాచౌదరిని కలిసిన వారిలో ఉన్నారు.