అమెరికా మార్కెట్లో కేన్సర్ ఔషధం
ప్రముఖ ఔషధ తయారీ సంస్థ నాట్కో ఫార్మాకు జపాన్‌కు చెందిన తైహో ఫార్మాస్యూటికల్స్ షాకిచ్చింది. పెటెంట్ హక్కులు లేకుండా క్యాన్సర్ వ్యాధిని నియంత్రించే ఔషధానికి జనరిక్ వెర్షన్ లాన్సర్ఫ్ ముందును అమెరికా మార్కెట్లో విడుదల చేయడంతో తైహో అమెరికా న్యాయస్థానంలో నాట్కోకు వ్యతిరేకంగా కేసును దాఖలు చేసింది. డిసెంబర్ 30న స్థానిక జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దేశీయ ఫార్మా సంస్థయైన నాట్కో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన లాన్సర్ఫ్ విక్రయించకుండా, తయారుచేయడాన్ని నిలిపివేయాలని స్థానిక కోర్టు కంపెనీని ఆదేశించింది. అమెరికా మార్కెట్లో లాన్ సర్ఫ్ ఔషధాన్ని విక్రయించడానికి తైహో ఫార్మా స్యూటికల్స్‌కు చట్టపరమైన అన్ని అనుమతులు, ముఖ్యంగా పెటెంట్ హక్కులు కలిగివున్నది.













