జీవగడియారంతో కరోనా కంట్రోల్ !
హ్యూమన్ బయోలాజికల్ క్లాక్ (జీవగడియారం)తో రోగరహిత జీవనాన్ని సృష్టించుకోవచ్చని.. దీనితో కరోనా లాంటి ప్రాంణాంతక వైరస్ను సైతం నియంత్రిచవచ్చని మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకురాలు యడ్లపల్లి స్వాతి అన్నారు. అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న జీవగడియారంపై పరిశోధన ప్రాజెక్టుకు కృష్ణా జిల్లాకు చెందిన స్వాతి ఎంపికయ్యారు. గుడివాడ ఏఎన్నార్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ యెర్నేని వెంకటేశ్వరరావు మనవరాలు ఆమె. గుడివాడ వచ్చిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ జీవగడియారం ప్రాజెక్టు కోసం మిచిగాన్ యూనివర్సిటీ ఇప్పటివరకు రెండు దఫాలుగా రూ.24 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఎంఎస్ చేస్తుండగా తనకు బయాలజీపై దృష్టి మళ్లిందన్నారు. నేటి పరిశోధన రంగంలో బ్రెయిన్క్లాక్స్ ద్వారా వ్యక్తిలోని వ్యాధి నిరోధకశక్తిని ఎలా పెంచాలి, జీవుల మనుగడక హాని కలిగించే వైరస్లు ఏవి? వాటిని ఎలా నిర్మూలించాలో తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ పరిశోధనల ద్వారా భవిష్యత్తులో అతి ప్రమాదకరమైన వైరస్లను ఎలా నిర్వీర్యం చేయవచ్చో గుర్తించవచ్చని పేర్కొన్నారు.













