నాష్ విల్లేలో శ్రీనివాస కళ్యాణం
నాష్విల్లేలోని గణేష్ ఆలయంలో శ్రీనివాస కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్)ల ఆధ్వర్యంలో గత నెల 28న నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో విగ్రహాలను అలంకరించి శ్రీనివాస కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కళ్యాణ కమిటీ సభ్యులు ఆల రామక ష్ణారెడ్డి, నూకల నరేందర్ రెడ్డి, సుషీల్ చందా, గుడూరు కిశోర్ రెడ్డి, దయప ప్రకాశ్ రెడ్డి, పునీత్ దీక్షిత్, రవి కిరణ్, రాధిక రెడ్డి, నూకల లావణ్య, మంజూ లిక్కి, బూస సునీత, అరమండ్ల రాధిక, రాచకొండ సాయిరాం, కేస సిరిషా తదితరులు పాల్గొన్నారు.













