సింగపూర్ లో నెల రోజులు లాక్ డౌన్
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలన్ని లాక్డౌన్ బాట పట్టాయి. మనదేశంతోపాటు ఎన్నో దేశాలు లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి. తాజాగా లాక్డౌన్ ప్రకటించిన దేశాల జాబితాలో సింగపూర్ కూడా చేరింది. వచ్చే మంగళవారం నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని లీ హసీన్ లూంగ్ ప్రకటించారు. ఎమర్జెన్సీ సర్వీసులు, ముఖ్యమైన ఆర్థిక రంగాలు తప్ప అన్ని ఆఫీసులను మూసేస్తామన్నారు. పరిస్థితులు మారుతున్నందున కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధమన్నారు.













