సిలికానాంధ్ర మనబడి – తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు!
మీకు ముందుగా సిలికానాంధ్ర మనబడి తరఫున కీ||శే. శ్రీ గిడుగు రామ్మూర్తి వారి పుట్టినరోజు మరియు తెలుగుభాషాదినోత్సవ శుభాకాంక్షలు.
మనబడి తెలుగుభాషాదినోత్సవ సందర్భంగా ఈ రోజు, ఆదివారం Aug 29, 2021 ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మీకందిస్తోంది!
ఇందులో భాగంగా మూడు ప్రధాన అంశాలుంటాయి.
- బాస–యాస–ప్రాంతీయశ్వాస– విశిష్ఠ అతిథులచే వివిధ మాండలికాలపై చర్చ – యాసలు – భాషకు సొగసులు!
- వకృత్త్వ పోటీల విజేతల ప్రకటన– తెలుగుభాషాదినోత్సవ సందర్భంగా మనబడి నిర్వహణ
- ప్రముఖ మిమిక్రీ కళాకారుడు – ఇమిటేషన్ రాజుగారి ప్రత్యేక కార్యక్రమం
ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని మనబడి యూట్యూబ్ ఛానెల్ https://youtu.be/Km8ydmD3k4Y ద్వారా వీక్షించి ఆనందించమని మనవి!
ఇది 4 PM ET/ 3 PM CT/ 1 PM PT సమయానికి ప్రారంభమై ఒక రెండు గంటలపాటు మిమ్మల్నందరినీ అలరిస్తుంది!
రండి, చేయి చేయి కలుపుదాం!
తెలుగుదనాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటుదాం!
భాషాసేవయే భావితరాల సేవ!
రాజు చమర్తి
Ph: 408-685-7258













