సెరెనాకు షాక్
అమెరికా స్టార్ ప్లేయర్, 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత సెరెనా విలియమ్స్‌కు వెస్ట్రన్, సదరన్ ఓపెన్‌లో ఎదురుదెబ్బ తలిగింది. బుధవారం ఇక్కడ జరిగిన టోర్నీ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్ సెరెనా 7-5, 6-7(5/7), 1-6 తేడాతో గ్రీక్ ప్లేయర్ మారియా సక్కరి చేతిలో పరాజయం పాలైంది. మ్యాచ్‌లో పాయింట్ల మధ్య ఎక్కువ సమయం తీసుకుంటున్నట్టు రిఫరీ నుంచి పలుసార్లు హెచ్చరికలు పొందిన సెరెనా సరిగ్గా రాణించలేకపోయింది. కాగా వచ్చే వారం యూఎస్ ఓపెన్ ప్రారంభం కాన్ను నేపథ్యంలో సెరెనాకు ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు. టోర్నీ పురుషుల సింగిల్స్‌లో జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ప్రిక్వార్టర్స్‌లో సెర్బియా స్టార్ జొకో 6-2, 6-4 తేడాతో టెనిస్ సాండ్ గ్రెన్పై సునాయాస విజయం సాధించాడు.













