ఆసక్తితో ఎదురు చూస్తున్నా : సెరెనా
ఈ ఏడాది జరిగే ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో బరిలోకి దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్సన్ ప్రకటించింది. ఈ టోర్నీలో ఆడేందుకు తాను ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని సెరెనా పేర్కొంది. కాగా, ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్న ఈ టోర్నీలో ఆడేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని సృష్టం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మకమైన టోర్నీలు రద్దయ్యాయని ఇటువంటి సమయంలో యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లను నిర్వహించేందుకు చొరవ చూపిన టెన్నిస్ సమాఖ్యను సెరెనా అభినందించింది.













