సతీష్ చుండ్రు, జికె స్పందన ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో కోడిగుడ్ల పంపిణీ
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వలన ఇబ్బందులు పడుతున్న పేదలకు జికె స్పందన చారిటబుల్ ట్రస్ట్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధి సతీష్ చుండ్రు, వారి మిత్ర బృందం బాసటగా నిలిచింది. స్థానిక 48వ డివిజన్లో డ్వాక్రా సంఘాలు, ఆర్.పి.లు, శానిటరీ సిబ్బంది, ఆటో కార్మికులకు కోడిగుడ్లను పంపిణీ చేశారు. డివిజన్ మాజీ కార్పొరేటర్ గరగ పార్వతి మురళీకృష్ణ వినతి మేరకు గుడా మాజీ చైర్మన్, జికె స్పందన చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ గన్ని కృష్ణ స్పందించి కోడిగుడ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి తానా ప్రతినిధి చుండ్రు సతీష్ బ•ందం సహకారం అందజేశారు. గరగ పార్వతి, గరగ మురళీకృష్ణ, ఉప్పులూరి జానకిరామయ్య, గన్ని వ్యక్తిగత సహాయకులు అబ్దుల్ ముజీబ్, తదితరులు కోడిగుడ్లు పంపిణీ చేశారు. తమ విజ్ఞాపనకు స్పందించి సహకరించిన జికె స్పందన చారిటబుల్ ట్రస్ట్, తానాకు పేదలు కృతజ్ఞతలు తెలిపారు.






