ప్రవాసులను అలరించిన ఆర్పీ పట్నాయక్ వర్చువల్ లైవ్ షో
కళాకారులు, సిలికానాంధ్ర సంజీవనీ వైద్యాలయ అభివృద్ధి కోసం
మిచిగన్: జూన్ 27 లైవ్ షోల్లో కొత్త ట్రెండ్‌కు ఆర్పీ పట్నాయక్ వర్చువల్ లైవ్ షో శ్రీకారం చుట్టింది.. కరోనా నేపథ్యంలో పని దొరక్క కష్టాలపాలైన కళాకారుల కోసం, మరియు సిలికానాంధ్ర సంజీవని హాస్పిటల్ ల అభివృద్ధి కోసం మ్యూజికల్ షోలు ఎలా అనిఆలోచిస్తున్న తరుణంలో ఆర్పీ వర్చువల్ లైవ్ షో ఇక ముందు షోలు ఇలా కూడా జరుపుకోవచ్చనే ఓ ట్రెండ్‌ను సృష్టించాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తో పాటు పదికి పైగా తెలుగు సంఘాలు, సంస్థలు ఈ వర్చువల్ లైవ్ షోకిమద్దతు తెలిపి… తమ సహాయ సహకారాలు అందించాయి..ఆర్పీ పట్నాయక్ తన తోటి గాయనీ, గాయకులైన సత్యయామిని, సాహితీ సోనీ, అనుదీప్ దేవ్మనీషా ఈరబత్తిని లతో అలరిస్తూనే మరో వైపు అమెరికాలో ప్రతిభ కలిగినస్థానిక గాయనీ, గాయకులకు ఇందులో పాటలు పాడే అవకాశం కల్పించారు. సూపర్ హిట్ సాంగ్స్ఎంచుకున్న అమెరికాలో ప్రవాస తెలుగు గాయకులు తమ గాన మాధుర్యాన్ని పంచారు.
ఆర్పీ పట్నాయక్ సినిమాల్లోనిపాటలతో పాటుతెలుగు సినిమాల్లోని ఆణిముత్యాలను వర్చువల్ షోలో పాడి వినిపించారు. ఈ లైవ్ లో తన్మయులై చిందేసిన వారినిఆన్లైన్ ద్వారా కనెక్ట్ చేసి వారి విజువల్స్ ప్లే చేయడంతో.. ఆటకు పాట కూడా జోడై.. ఈ షో మరింత రక్తి కట్టింది. హైదరాబాద్ నుంచి ఆర్పీ పట్నాయక్లైవ్ షో నిర్వహిస్తూనే ఆన్లైన్లో అనేక మంది గాయనీ, గాయకులనుఅనుసంధానం చేసి ఓ కొత్త ఒరవడికి శ్రీకారంచుట్టారు. ఈ వర్చువల్ లైవ్ షో విజయవంతం కావడానికి ఆరెంజ్ మూన్ కాన్సెప్ట్ మీడియా అధినేత అశోక్ బడ్డి, మిచిగన్ నుండి శ్రీని తొంట, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) నుంచి నాట్స్ బోర్డ్ డైరెక్టర్ కిషోర్ కంచర్ల, చికాగో నుండి రాజ్పొట్లూరి, మిచిగన్ నుండి హరి దేవబత్తుని, చికాగో నుండి చాందిని దువ్వూరి, మిచిగన్ నుండి స్వప్న చిల్లా తదితరులుకీలక పాత్ర పోషించారు. వర్చువల్ లైవ్‌ను లక్ష పాతిక వేలమంది ప్రవాసులు వీక్షించారంటే ఈ షో ఎంత హిట్అయిందనేది స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో ఇక ఎంటర్టైన్మెంట్ ఆన్లైన్లోనే ఎలా చేయవచ్చనేది ఈ షో ఓఉదాహారణగా నిలిచిపోనుంది. అమెరికాలో సిలికానాంధ్ర, సంజీవని హాస్పిటల్, సాయి దత్త పీఠం, తెలుగు ఫైన్ ఆర్ట్స్సొసైటీ (టి.ఎఫ్.ఏ.ఎస్) తెలుగు అసోసియేషన్ అఫ్ సథరన్ కాలిఫోర్నియా (TASC), శాండియాగో తెలుగుఅసోసియేషన్, NRIVA వంటి తెలుగు సంస్థలు, సంఘాల సహకారంతో ఈ షో విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి వారం ముందు మాత్రమే వారిని సంప్రదించినప్పటికీ ఈ ఈవెంట్ కు తమ పూర్తి సహకారంఅందించిననాట్స్ సంస్థ ను ఆరెంజ్ మూన్ కాన్సెప్ట్ మీడియా అధినేత అశోక్ బడ్డి ప్రత్యేకంగా అభినందించారు.













