రైడ్4 ఫ్యూచర్ సైకిల్ యాత్రను ప్రారంభించిన కర్నూలు జిల్లా కలెక్టర్
కర్నూలు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఉత్తర అమెరికా రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ కోమటి జయరాం గారి ఆధ్వర్యంలో NRI ప్రవాస ఆంధ్రుల విరాళాలతో ఆంద్రప్రదేశ్ జన్మభూమి కార్యక్రమంలో అభివృద్ధి జరిగిన డిజిటల్ క్లాస్ రూంల కార్యక్రమాన్ని డాక్యుమెంటేషన్ చేసే రైడ్4 ఫ్యూచర్ సైకిల్ యాత్రను కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ సత్యనారాయణ I.A.S గారు జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు మాట్లాడుతూ శ్రీ కోమటి జయరాం గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రవాసాంధ్రులు సేవలను కొనియాడారు, అలాగే ఈ రైడ్4ఫ్యూచర్ యాత్రను చేపట్టిన ప్రదీప్ కరుటూరి మరియు అమర్ అక్బర్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి తెహర సుల్తాన గారు N. R. I. తానా కోశాధికారి రవి పొట్లూరి పాల్గొన్నారు. ఈ రైడ్ కర్నూలు జిల్లా లోని ఆదోని, ఆలూరు, అమిగనూరు, గ్రామాల మీదుగా సాగి 13 జిల్లాలు 2000 కిలోమీటర్లు జరుగుతుంది. ఈ రైడ్ ని ఆంద్రప్రదేశ్ జన్మభూమి కన్సల్టెంట్ మరియు డిజిటల్ క్లాస్ రూమ్ ప్రోగ్రాం ఇంచార్జి ప్రదీప్ కరుటూరి, జన్మభూమి వలంటీర్ ప్రకృతి వ్యవసాయ ప్రచారకుడు రైతు అమర్ అక్బర్ పూర్తిచేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో లో ప్రవాసాంధ్రులు ఇంకెలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లో పాలుపంచుకోవచ్చో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సూచనలు తీసుకుంటూ, అలాగే పర్యావరణ పరిరక్షణ పై విద్యార్థులకు రైతులకు అవగాహన తీసుకువస్తూ ముందుకు సాగుతుంది, మొదటి రోజు యాత్రలో కర్నూలులోని ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ హైస్కూలు లో ఉపాద్యాయులు, మరియు, విద్యార్థుల నుండి వివరాలు సేకరించి డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది.













