అమెరికా డిగ్రీలున్న వారికి శుభవార్త
అమెరికా ఉన్నత విద్యాసంస్థల అడ్వాన్స్డ్ డిగ్రీలున్న విదేశీయులకు ప్రాధాన్యమిచ్చేలా హెచ్-1బీ వీసాల విధానంలో మార్పుల్ని ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. భారత్, చైనా తదితర దేశాల నుంచి వచ్చేవారి కంటే ఈ డిగ్రీలున్నవారికి ప్రాధాన్యం లభిస్తుంది. ప్రతిభ ఆధారిత వలసలకు మద్దతుగా నిలుస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న ప్రకటనలను అనుగుణంగా ఈ విధానం ఉంటుంది. అమెరికాలో డిగ్రీలు చదివినవారు హెచ్-1బీ వీసాల లాటర్లీలో ఎంపికయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎలక్ట్రానిక్ విధానంలోనూ పిటిషన్లను నమోదు చేసుకునేందుకు నూతన విధానంలో అవకాశం కల్పిస్తారు. అయితే ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే హెచ్-1బీ 2020 సెషన్‌కు మాత్రం ఇది అందుబాటులోకి రాదు. వృత్తి నిపుణులకు అమెరికా ఏటా 65 వేల వరకు వీసాలు ఇస్తోంది. వీటిలో 70 శాతానికి పైగా భారతీయుల పొందుతుంటారు.













