GWTCS: జిడబ్ల్యుటీసిఎస్ బలోపేతానికి కృషి చేస్తా….రవి అడుసుమిల్లి
గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) నూతన అధ్యక్షునిగా రవి అడుసుమిల్లి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు కొత్త కార్యవర్గ సభ్యులు కూడా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా రవి అడుసుమిల్లి(Ravi Adusumilli) మాట్లాడుతూ ఐదు దశాబ్దాలుగా కమ్యూనిటీకి సేవలందిస్తున్న జిడబ్ల్యుటీసిఎస్ బలోపేతానికి విశేషంగా కృషి చేస్తానని చెప్పారు. అలాగే యువతకు పెద్దపీట వేస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.
పూర్వాధ్యక్షులు కృష్ణ లాం మాట్లాడుతూ.. చరిత్రలో నిలిచిపోయే విధంగా నభూతో అన్న రీతిన.. స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించామని అన్నారు. ఇందులో భాగంగా తమకు సహకరించిన దాతలకు, సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పూర్వాధ్యక్షుడు కృష్ణ లాం, జక్కంపూడి సుబ్బారాయుడు, త్రిలోక్ కంతేటి, కిషోర్ దంగేటి, సాయిసుధ పాలడుగు, తానా ప్రతినిధులు నరేన్ కొడాలి తదితరులు పాల్గొన్నారు.







